ఇల్లంతకుంట, సెప్టెంబర్ 11 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండలంలోని జంగంరెడ్డిపల్లె గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మహిళలు శుక్రవారం సాయంకాలం సమయంలో బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వర్షాలు లేక బావుల్లో నీరు తగ్గిపోయిందని,వరి పంటలకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.సమృద్ధిగా వర్షాలు కురిసి బావుల్లో నీరు చేరి,వరి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు.పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుతూ బతుకమ్మ ఆడారు.మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
Telangana
వర్షం కోసం బతుకమ్మ ఆడిన మహిళలు..జంగంరెడ్డిపల్లెలో బతుకమ్మ ఆడుతూ వర్షాల కోసం వేడుకోలు..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త ప్రతినిధి..✍️