అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, అక్టోబర్10 మన వార్త : సేవాభావంతో అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 20వ నెలకు చేరుకుంది. అమావాస్య సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు, నిరుపేదలకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ప్రతి నెలా సుమారు 500 మందికి అన్నప్రసాదం అందిస్తూ సంఘం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ సేవాదళ్ సభ్యుడు ఐత సత్యం, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ తడక వెంకటేష్ గుప్తా, తొడుపునూరి బాలేష్, అమర బాలేష్, పాలకుర్తి నరేష్, గంగ మల్లేష్‌తో పాటు అల్వాల్ ప్రాంత ఆర్యవైశ్య సోదరులు, దాతలు సహకరించారు.
అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న అన్నదాతలు, దాతల కుటుంబాలపై శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Medchall -Malkajgiri district
అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని
