బొల్లారం రైల్వే స్టేషన్లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం!
ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత
బొల్లారం, అక్టోబర్ 16 (మన వార్త):బొల్లారం రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల చిరకాల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే ఉన్నతాధికారులను కోరడంతో ఈ దిశగా ముందడుగు పడింది. మొదటి, రెండో ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టులను ఏర్పాటు చేసి త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వెల్లడించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా ప్లాట్‌ఫారాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు మెట్లు ఎక్కి దిగాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైళ్లను అందుకునే సమయంలో మెట్లు ఎక్కడం, దిగడం ప్రయాణికులకు భారంగా మారుతోంది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎంపీ ఈటల రాజేందర్ బొల్లారం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా లిఫ్టులు ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
లిఫ్టుల ఏర్పాటు పూర్తయితే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులతో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా ప్లాట్‌ఫారాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగుదలకు ఈ ఏర్పాటు దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
బొల్లారం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎంపీ ఈటల రాజేందర్‌కు, ఇందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు స్థానిక ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. లిఫ్టుల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రయాణికులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
Medchall -Malkajgiri district
బొల్లారం రైల్వే స్టేషన్లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని