పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 16 మన వార్త : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 1,000 జరిమానా విధిస్తూ మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు అక్టోబర్ 13, 2026న న్యాయస్థానం తీర్పు ప్రకటించినట్లు అల్వాల్ పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఖానాజిగూడ, సుభాష్ నగర్‌కు చెందిన బొల్లారం దశరథ్ (49)పై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 102/2019 కింద కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354-A, 354-Dతో పాటు పోక్సో చట్టం 2012లోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసు విచారణలో భాగంగా మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు ఎస్సీ నంబర్ 624/2019 కింద విచారణ జరిపి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, 1,000 జరిమానా విధించింది.
ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఎస్‌ఐ బి.ఎస్.ఎస్. వరప్రసాద్ వ్యవహరించగా, అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. ప్రశాంత్ పర్యవేక్షణలో కేసు ప్రక్రియ కొనసాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు వ్యవహారాల సమన్వయంలో పోలీస్ కానిస్టేబుళ్లు జి. శ్రీనివాసులు, బి. సురేష్, లైజన్ అధికారిగా డబ్ల్యూఎస్‌ఐపీ కోటేశ్వరి సహకరించారు.
ఈ కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. వెంకటేష్ తీర్పు వెలువరించారు.
Medchall -Malkajgiri district
పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని