ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి..
మేడ్చల్ మల్కాజిగిరి, అక్టోబర్ 13 మన వార్త : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు తుర్కపల్లి బొల్లారం 190వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాలాల నరేందర్ రెడ్డి (లడ్డూ) ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ,అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నారు.వర్షాలకు దెబ్బతిన్న వివిధ కాలనీ రహదారులకు తన ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బందితో ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి చేయించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ తుర్కపల్లి–బొల్లారం అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏ. సురేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, స్వామి, శ్రీనివాస్, బాలరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Medchall -Malkajgiri district
ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని