మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం,
రాజయ్య లింగం ప్రైడ్ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 25 మన వార్త : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం మార్కెట్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రాజయ్య లింగం ప్రైడ్ భవనం మొదటి అంతస్తు మెట్ల వద్ద సుమారు 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం అక్టోబర్ 24న డయల్ 112కు అందిన సమాచారం మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎం.డి. గౌస్ పాషా, హోంగార్డు నాగరాజు గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ సుమారు 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. పరిసర ప్రాంతాల వారిని విచారించగా, మృతుడిని నారాయణగా పిలుస్తారని తెలిసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆయన పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
మృతుడి వివరాలు తెలిసిన వారు సంప్రదించండి
మృతుడిని గుర్తించి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు అల్వాల్ పోలీసులు ప్రజల సహకారాన్ని కోరుతున్నారు. మృతుడి గురించి తెలిసిన వారు లేదా ఆయన బంధువుల ఆచూకీ తెలిసిన వారు కింది ఫోన్ నంబర్లలో పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కె. చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.
పోలీసుల సంప్రదింపు నంబర్లు:
- అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ: 8712663260
- అల్వాల్ ఎస్‌ఐ కె. చంద్రశేఖర్: 8712554142
మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
Medchall -Malkajgiri district
మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని