ఇల్లంతకుంట,అక్టోబర్ 12 (మన వార్త ప్రతినిధి):
సోషల్ మీడియా గ్రూపుల్లో ‘ఆర్‌టీఓ ట్రాఫిక్ ఈ-చలాన్’పేరుతో వస్తున్న అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు,లింకులను ఓపెన్ చేయవద్దని ఇల్లంతకుంట స్థానిక ఎస్సై ఉపేంద్ర చారి మండల ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఫైళ్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారం,బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు.వాట్సాప్ గ్రూపులు,ఇతర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే అనుమానాస్పద ఫైళ్లు,లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.ట్రాఫిక్ చలాన్ల వివరాలను అధికారిక మార్గాల్లోనే పరిశీలించాలని సూచించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని,1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
Telangana
సోషల్ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన..
Quick Summary:
మన వార్త ఇల్లంతకుంట..✍️