22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి,
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అక్టోబర్ 13 మన వార్త ప్రతినిధి:అల్వాల్ మండల పరిధిలోని శివనగర్,కనాజిగూడ, తుర్కపల్లి ప్రాంతాల్లో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, ఆయా ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన సమస్యలను వివరించారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అంశాన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, దేవయ్య గౌడ్, మోసిన్, విజయశేఖర్, జేడీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Medchall -Malkajgiri district
22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని