మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు,
మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అక్టోబర్ 13 మన వార్త ప్రతినిధి : మచ్చ బొల్లారం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చొరవతో, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి ఫలితంగా హనుమాన్ టెకిడి ప్రాంతంలోని భూలక్ష్మమ్మ ఆలయం సమీపంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో రాకపోకలు సులభతరమవుతాయని, కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Medchall -Malkajgiri district
మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని
