ఇల్లంతకుంట,అక్టోబర్ 14 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండలంలో కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాచకట్ల సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ.సుధర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ రెండు రోజులు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉంటారని వెల్లడించారు.అర్హులైన కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ఫారం-6 నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని తహసీల్దార్ సూచించారు.
Telangana
కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో..
Quick Summary:
మన వార్త ఇల్లంతకుంట..✍️