ఆరు ఇంచుల పైప్ వేయడంతో ఆందోళన,
అరుణోదయం హాస్పిటల్‌కు నీటి కనెక్షన్ పనులపై కాలనీవాసుల ప్రశ్నలు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 1 మన వార్త :తుర్కపల్లి బొల్లారం ప్రాంతంలోని అరుణోదయం హాస్పిటల్‌కు నీటి కనెక్షన్ కోసం రోడ్డు తవ్వకాలు, పైప్‌లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో స్థానికుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనులకు సంబంధిత శాఖల అనుమతులు, సాంకేతిక అనుమతులు ఉన్నాయా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కాలనీవాసులు కోరుతున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, పైప్‌లైన్ పనులు కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో కూడా జరుగుతున్నాయి. రోడ్డు తవ్వకాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు పనులను పరిశీలించి, అనుమతులు మరియు పనుల విధానం గురించి వివరాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.
అరుణోదయం హాస్పిటల్‌కు నీటి సరఫరా కోసం సుమారు ఆరు ఇంచుల పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇదే సమయంలో తమ కాలనీకి వచ్చే నీటి సరఫరా పరిమాణం, సమయంపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు కాలనీవాసులు పేర్కొంటున్నారు.
కాలనీ అవసరాలకు సరిపడా నీరు రావడం లేదు. ప్రస్తుతం సుమారు 30 నిమిషాల పాటు మాత్రమే నీరు వదలడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని స్థానికులు తెలిపారు.
అయితే హాస్పిటల్‌కు మంజూరైన నీటి కనెక్షన్ సైజు ఎంత ఆరు ఇంచుల పైప్‌లైన్‌కు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? రోడ్డు తవ్వకాలకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా హాస్పిటల్‌కు నీటి సరఫరా వల్ల సమీప కాలనీల నీటి సరఫరాపై ఏమైనా ప్రభావం ఉంటుందా అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
రోడ్డు తవ్వకాలు, పైప్‌లైన్ ఏర్పాటు, నీటి కనెక్షన్ అనుమతులు, అలాగే కాలనీ నీటి సరఫరా పరిస్థితిపై అల్వాల్ ఎంఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
Medchall -Malkajgiri district
ఆరు ఇంచుల పైప్ వేయడంతో ఆందోళన, అరుణోదయం హాస్పిటల్‌కు నీటి కనెక్షన్ పనులపై కాలనీవాసుల ప్రశ్నలు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని

