అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల రిలే నిరాహార దీక్ష,
హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: తెలంగాణ ఉద్యమకారులు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 5 మన వార్త : తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 19వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పుట్నాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరింత జాప్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు వాటి అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సమస్యలపై సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి, పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
19వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా అంబర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన మలిదశ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు నిఖిల్, మల్లేష్ దీక్షలో కూర్చున్నారు.
ఈ కార్యక్రమంలో పుట్నాల కృష్ణ,ఢిల్లీ పరమేష్,పటోళ్ల సురేందర్ రెడ్డి, దయాకర్, ముత్యాలు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా ప్రాధాన్యతగా తీసుకుని, ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. హామీల అమలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని ఉద్యమకారుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
Medchall -Malkajgiri district
అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల రిలే నిరాహార దీక్ష, హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: తెలంగాణ ఉద్యమకారులు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని