సూర్యనగర్‌లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం,
లాక్ వేసిన ఇళ్లను టార్గెట్ చేసినట్లు అనుమానం అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచన..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 6 మన వార్త : అల్వాల్ పరిధిలోని సూర్యనగర్ లాస్ట్ బస్‌స్టాప్ సమీపంలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. లాక్ వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి ప్రయత్నించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటివాళ్లు అనుమానాస్పద వ్యక్తులను గమనించి గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. సూర్యనగర్‌కు రావడానికి ముందు మరో ఇంట్లో కూడా దొంగతనం చేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం సమీపంలోని లక్ష్మి ఎంక్లేవ్‌లో కూడా దొంగతనం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో సూర్యనగర్, లక్ష్మి ఎంక్లేవ్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని కోరుతున్నారు.
అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులు సూచిస్తున్నారు.రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచి,నివాస ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Medchall -Malkajgiri district
సూర్యనగర్‌లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, లాక్ వేసిన ఇళ్లను టార్గెట్ చేసినట్లు అనుమానం అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచన..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని