ఇల్లంతకుంట, అక్టోబర్ 6 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్ ఎవరనే అంశంపై మండల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.చైర్మన్ పదవికి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడి సతీమణి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం...ఉపాధ్యక్షుడు,పాలకవర్గ సభ్యుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది...దీనికి సంబంధించిన ఉత్తర్వులు (జీవో) త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.గత ఏఎంసీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 18తో ముగిసింది.దీంతో నూతన పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈసారి చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడి సతీమణి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.“కష్టకాలంలో పార్టీకి అండగా..”మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు సదరు యువ నాయకుడు విధేయుడిగా ఉంటూ పార్టీ కష్టకాలంలోనూ కాంగ్రెస్కు అండగా నిలిచారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు కేసులు,ఒత్తిళ్లు ఎదురైనా పార్టీ మారకుండా కాంగ్రెస్ జెండాను వీడలేదని చెబుతున్నారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపులోనూ ఆయన కీలకంగా పనిచేశారని పార్టీ వర్గాల్లో చర్చ ఉంది.“జీవో కోసం ఎదురుచూపులు...”ఈ నేపథ్యంలో యువ నాయకుడి సతీమణికి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కనున్నట్లు సమాచారం రావడంతో మండల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఉపాధ్యక్షుడు,పాలకవర్గ సభ్యుల పేర్లు కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.అయితే అధికారికంగా జీవో విడుదలైతేనే పదవులపై పూర్తి స్పష్టత రానుంది..ఏఎంసీ నూతన పాలకవర్గానికి సంబంధించిన జీవో ఎప్పుడు వెలువడుతుందా అని మండల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Telangana
ఎవరి వైపు ఏఎంసీ పీఠం..?యువనేత సతీమణి పేరు తెరపైకి..జీవో కోసం ఎదురుచూపులు..
Quick Summary:
మన వార్త...✍️