ఇల్లంతకుంట, అక్టోబర్ 06 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్ పదవికి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడి సతీమణి పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చైర్మన్తో పాటు ఉపాధ్యక్షుడు,పాలకవర్గ సభ్యుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం.అయితే అధికారిక ఉత్తర్వులు (జీవో) వెలువడాల్సి ఉంది.గత ఏఎంసీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 18తో ముగిసింది.ఈసారి చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించినట్లు సమాచారం.దీంతో యువ నాయకుడి సతీమణి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.కష్టకాలంలో పార్టీకి అండగా..సదరు యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలిచారని,ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు విధేయుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఎమ్మెల్యే గెలుపులోనూ ఆయన కీలకంగా పనిచేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.జీవోతోనే స్పష్టత
చైర్మన్,ఉపాధ్యక్షుడు,పాలకవర్గ సభ్యుల పేర్లపై స్పష్టత రావాలంటే అధికారిక జీవో విడుదల కావాల్సి ఉంది.జీవో ఎప్పుడు వెలువడుతుందోనని మండల ప్రజలు,రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..
Telangana
ఏఎంసీ పీఠం ఎవరి వైపు..?యువనేత సతీమణి పేరు పరిశీలనలో..జీవో కోసం ఎదురుచూపులు..
Quick Summary:
మన వార్త ఇల్లంతకుంట..✍️