భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - పేరూరు ఎస్ఐ జి. కృష్ణప్రసాద్
వాజేడు జులై 29 మనవార్త
భారీ వర్షాల కారణంగా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేరూరు ఎస్ఐ శ్రీ జి. కృష్ణప్రసాద్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, వాగులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాలను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.చేపల వేట కోసం గోదావరి, వాగులు, చెరువులు, ఇతర జలాశయాలకు వెళ్లరాదని కోరారు. ప్రాణాపాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.పశువుల కాపరులు పశువులను మేపుటకు అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉండే వాగులు, లోతట్టు ప్రాంతాలు దాటవద్దని, కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్నందున వాటి సమీపంలో పశువులను మేపవద్దని సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లయితే వెంటనే పోలీస్ అత్యవసర సేవ డయల్–100 కు సమాచారం అందించాలని కోరారు.భారీ వర్షాల నేపథ్యంలో పేరూరు ఎస్ఐ జి. కృష్ణప్రసాద్ మర్రి వాగును, రేగుమాకు వాగును పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ప్రజలందరూ పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండి సహకరించాలని పేరూరు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
Telangana
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -పేరూరు ఎస్ఐ జీ. కృష్ణప్రసాద్
Quick Summary:
కవిరాజు