స్ట్రీట్ లైట్స్ కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు బకాయి.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అల్వాల్ సర్కిల్ డిమాండ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, జూన్ 15 (మన వార్త): జీహెచ్‌ఎంసీ స్ట్రీట్ లైట్స్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారతీయ జనతా పార్టీ అల్వాల్ సర్కిల్ నాయకులు పేర్కొన్నారు.
సదరు కాంట్రాక్టర్ గత మూడు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ వంటి అవసరాలను తీర్చుకోలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
అలాగే కాంట్రాక్టర్ పి. ధనంజయ్ నిర్వహిస్తున్న సాయి కీర్తన ఎంటర్‌ప్రైజెస్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపై జీతాల చెల్లింపును నేరుగా జీహెచ్‌ఎంసీ ద్వారానే నిర్వహించి కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ మేరకు బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు పీ. మల్లికార్జున్ గౌడ్ (మల్కాజిగిరి అసెంబ్లీ కో-కన్వీనర్), కే. అజయ్ రెడ్డి (133 మచ్చ బొల్లారం అధ్యక్షుడు), కే. కార్తీక్ గౌడ్ (134 అల్వాల్ అధ్యక్షుడు), జి. శ్రీధర్ రెడ్డి (135 వెంకటాపురం అధ్యక్షుడు), కే. సాయి రెడ్డి తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Medchal -Malkajgiri District
స్ట్రీట్ లైట్స్ కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు బకాయి.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అల్వాల్ సర్కిల్ డిమాండ్
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
