ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన,
మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డోలి రమేష్.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, జూన్ 17 మనవార్త : అల్వాల్ సర్కిల్ పరిధిలోని 191వ డివిజన్ మచ్చ బొల్లారంలో మచ్చ బొల్లారం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డోలి రమేష్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మచ్చ బొల్లారం ప్రభుత్వ పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికంటి శ్రీధర్ హాజరై మాట్లాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ప్రజలు ఆదరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో మరింత అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, రమేష్, డప్పు రాజు, పవన్, మచ్చ బొల్లారం సీనియర్ మైనారిటీ నాయకుడు మహమ్మద్ జావీద్, నార్ల సురేష్, మధు పటేల్, అతీక్ పాషా, సతీష్, రేవంత్ రెడ్డి, రాచకొండ వెంకటేష్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Medchal -Malkajgiri District
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన, మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డోలి రమేష్.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని