శంకరపట్నం:జూన్17(మనవార్త ప్రతినిధి)
కారు స్కూటీ ఢీకొని ఇద్దరికి గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళ్తే శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చీకట్ల రాజమౌళి (48) మరియు గాజుల రాజేంద్రప్రసాద్ (43)ఇద్దరు కలిసి మొలంగూర్ నుండి కేశవపట్నంలో గల ఎస్బిఐ బ్యాంకుకు వెళుతుండగా రోడ్డు క్రాస్ చేస్తుండగా హుజురాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్నటువంటి కారు బలంగా స్కూటీని ఢీకొంది.ఈ ఘటనలో స్కూటీ మీద వెళ్తున్న రాజమౌళి కి కుడి కాలు,కుడి చేయి విరిగింది.మరియు రాజేంద్రప్రసాద్ కు ఎడమ కాలు విరిగింది.అది చూసిన స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి మరియు పైలెట్ ఆర్ సి రెడ్డి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లోనికి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
Telangana
కారు స్కూటీ డీ..ఇద్దరికీ గాయాలు...
Quick Summary:
శంకరపట్నం , మనవార్త