మునిగిన మోడీకుంట, మర్రిమకు వాగులు -ఎస్ఐ కృష్ణప్రసాద్ ప్రహరా
కడెకల్ లో 25 ఎకరాల వరి పంట నీట మునిగింది..
వాజేడు జులై 31 మనవార్త
ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాజేడు మండలంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.కడెకల్ - కృష్ణాపురం గ్రామాల మధ్య 163వ జాతీయ రహదారిపై మోడీకుంట వాగుపై నిర్మించిన బ్రిడ్జి గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో మునిగిపోయింది.అదేవిధంగా పేరూరు - చండ్రుపట్ల గ్రామాల మధ్య మర్రిమకు వాగు, ఏడజర్లపల్లి - పూసురు గ్రామాల మధ్య బ్రిడ్జి కూడా మునిగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోడీకుంట వాగు వద్ద పేరూరు ఎస్ఐ జీ. కృష్ణప్రసాద్ తన సిబ్బందితో రహదారిపై తాళ్లు కట్టి ప్రయాణికులు, వాహనదారులు వెళ్లకుండా ప్రహరా కాస్తున్నారు.కడెకల్ గ్రామంలో గోదావరి బ్యాక్ వాటర్ కు 25 ఎకరాల కారేత వరి పొలాలు నీట మునిగాయి.ప్రయాణికులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని ఏఈఓ హరీష్, కృష్ణాపురం సర్పంచ్ విజయబాబు, సెక్రటరీ కుర్సం నరేష్, హోంగార్డ్ ఆనంద్, గ్రామపంచాయతి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
Telangana
ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మునిగిన మోడీకుంట, మర్రిమకు వాగులు - ఎస్ఐ కృష్ణప్రసాద్ ప్రహరా.. కడెకల్ లో 25 ఎకరాల వరి పంట నీట మునిగింది..
Quick Summary:
కవిరాజు