ఇల్లంతకుంట, జూన్ 20 (మన వార్త ప్రతినిధి);
స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు శనివారం ఇల్లంతకుంట తహసీల్దార్ రాచకట్ల సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడు వెగ్గళ్ల రాధాకిషన్ మాట్లాడుతూ స్వర్ణకారుల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని,కార్పొరేట్ సంస్థల ప్రభావంతో సంప్రదాయ వృత్తిదారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన పాలక మండలిని నియమించాలని ఆయన కోరారు.అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు చిలుముల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల పాత్ర గణనీయమైందని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవన స్థితి మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.జి.ఓ. 272ను సవరించి పటిష్టంగా అమలు చేయాలని,దొంగ బంగారం రికవరీల పేరుతో స్వర్ణకారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే 50 ఏళ్లు పైబడిన వృత్తిదారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఇరు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Telangana
స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..తహసీల్దార్‌కు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల వినతి..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త