చీకుపల్లి-పెద్దగొల్లగూడెం డైవర్షన్ రోడ్డుపై గ్రావెల్ పనులు ప్రారంభం
వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు పునరుద్ధరణ - బుధవారానికి పూర్తి చేస్తాం
వాజేడు ఆగస్టు 4 మనవార్త
వాజేడు మండలం చీకుపల్లి - పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య 163వ జాతీయ రహదారిపై ఇసుకవాగుపై నిర్మాణం చేస్తున్న వంతెన వద్ద వర్షపు నీటికి కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో 25 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో నిర్మాణ సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం రోడ్డుపై గ్రావెల్ పోసే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాలినడకన, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేశారు.నిర్మాణ సంస్థ సిబ్బంది మాట్లాడుతూ బుధవారం రోజులోగా పూర్తి స్థాయిలో రోడ్డు పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.ఈ రోడ్డు పునరుద్ధరణతో వరద సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే ఈ మార్గంపై ఆధారపడిన గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించనుంది.
Telangana
చీకుపల్లి-పెద్దగొల్లగూడెం డైవర్షన్ రోడ్డుపై గ్రావెల్ పనులు ప్రారంభం వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు పునరుద్ధరణ - బుధవారానికి పూర్తి చేస్తాం
Quick Summary:
కవిరాజు

