మచ్చ బొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన,
మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,కాంగ్రెస్ నాయకులు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అల్వాల్, జూన్ 21 మన వార్త : మచ్చ బొల్లారంలోని రాజీవ్ రహదారి రోడ్, అల్వాల్ సెలెక్ట్ టాకీస్ రోడ్డును అను సంధానించే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే మచ్చ బొల్లారం, అల్వాల్, సుచిత్రతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అలాగే ట్రాఫిక్ రద్దీ సమస్యకు కూడా గణనీయమైన ఉపశమనం లభించనుంది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ కీలక ప్రాజెక్టును ప్రారంభించడంలో సహకరించిన రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే ముగింపు పలకనున్న
ఈ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, లడ్డు రెడ్డి, శ్రీశైలం యాదవ్, సంపత్ యాదవ్, వెంకటేష్ గౌడ్, రాజేందర్ యాదవ్, రమేష్, ఆనంద్, కొండల్ రెడ్డి, డి. స్వామి, శంకర్, నవీన్, శ్రీను, నరేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, సురేందర్, దేవా, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయిన తర్వాత ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, ప్రజలు సురక్షితంగా, వేగంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
Medchal -Malkajgiri District
మచ్చ బొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,కాంగ్రెస్ నాయకులు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని