Telangana
జాలిగామలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
Quick Summary:
MURALI STAFF REPORTER
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని జాలిగామ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్లు సునీత, అనిత ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం లాంటివని, పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టడం ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. తల్లిపాలలో బిడ్డకు కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయని, ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఎదగడానికి దోహదపడతాయని వివరించారు. శిశువు పుట్టిన ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ కొమురయ్య, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం అనిత, ఆశా వర్కర్లు అరుంధతి, లావణ్యలతో పాటు పలువురు గర్భిణులు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.