సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పేరుకే అహ్మదిపుర్ ప్రభుత్వ ఆసుపత్రి పనిచేయని సి బి పి టెస్ట్‌ల మిషన్, గ్రామ ఆసుపత్రికి ఎడు సబ్ సెంటర్లు ఉన్నాయి 19 గ్రామాల నుండి ప్రజలు ఆసుపత్రికి వస్తుంటారు గత నాలుగు నెలలుగా సి బి పి టెస్ట్‌ల మిషన్ పనిచేయక పోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో ఆర్థికంగా వారు అవస్థలు పడుతున్నారు చాలా మంది ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు చిన్నపాటి గాయం జరిగిన కుట్లు కూడా వేయలేని పరిస్థితి ప్రతి చిన్న విషయానికి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుంది దీనితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల గ్రామ నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాంటి ఆస్పత్రిలో సరిపడా వసతులు, మిషన్లు మరమ్మతుకు గురై టెస్టులు లేక ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దవా ఖానలో సమస్యలను పరిష్కరించడంతోపాటు బ్లడ్ షాంపిల్
నిర్ధారణ పరీక్షల యంత్రానికి మరమ్మతులు చేపట్టి టెస్టులను అందుబాటులోకి తీసుకురావాలని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరుతున్నారు
ల్యాబ్ టెక్నీషియన్ వివరణ కోరగా...... గత మూడు నెలలుగా క్రితం సిద్దిపేట్ డిఎంహెచ్వో తెలుపగా పట్టించుకోవడం లేదు వివరణ ఇచ్చారు
Telangana
పేరుకే అహ్మదిపుర్ ప్రభుత్వ ఆసుపత్రి
Quick Summary:
MURALI STAFF REPORTER

