లక్ష్మీనారాయణ కాలనీ, సుభాష్‌నగర్‌లో రూ.6.42 లక్షల యూజీడీ పనులకు శ్రీకారం..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, అల్వాల్, జూన్ 21 మన వార్త : సుభాష్ నగర్ డివిజన్ 195వ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీ, సుభాష్‌నగర్‌లో రూ.6.42 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ) పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.
ప్రాంత ప్రజల నుంచి చాలా కాలంగా వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యూజీడీ పనులు పూర్తయితే మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పనులు ప్రారంభమైనందుకు హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.
Medchal -Malkajgiri District
లక్ష్మీనారాయణ కాలనీ, సుభాష్‌నగర్‌లో రూ.6.42 లక్షల యూజీడీ పనులకు శ్రీకారం
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
